![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-02 లో.. వైజాగ్ లోని శబరి అనాధాశ్రమానికి రౌడీలు వచ్చి బెదిరించి వెళ్తారు. జానకమ్మ బాధపడుతుంటే అంజలి టెన్షన్ పడుతుంది. మరోవైపు గీతాంజలి ఇనిస్టిట్యూట్ ఎండీ గీతాంజలి తమ ఇనిస్టిట్యూట్ మేనేజర్స్ తో మాట్లాడుతుంది. అయితే వైజాగ్ ఇనిస్టిట్యూట్ కావాలంటే అనాధాశ్రమం ఖాళీ చేపించాలని ఆ మేనేజర్ అనడంతో అయితే వారికి అమౌంట్ ఇచ్చి వేరే దగ్గర ప్లేస్ ఇద్దామని గీతాంజలి అనగానే అనవసరం లేదు మేడమ్.. ఆ ఓనర్ మనకు మాటిచ్చాడు.. వాళ్ళని ఖాళీ చేపిస్తానను అన్నాడంటూ మరో మేనేజర్ చెప్తాడు. సరే అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని గీతాంజలి వారికి చెప్తుంది.
మరోవైపు ఇంట్లో గీతాంజలి కూతురు భవి అందంగా ముస్తాబు అవుతుంది. బావ ఇలా నన్ను చూస్తే ఇంప్రెస్ అవుతాడని భవి అనుకుంటుంది. కొన్ని సెల్ఫీలు దిగి వాళ్ళ బావకి పంపిస్తుంది భవి. మరోవైపు భవి వాళ్ళ బావ, గీతాంజలి మేనల్లుడు తన చెల్లితో కార్ లో వస్తారు. ఇక అతను అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్తాడు. ఇక ఆ అమ్మాయి చేయిని తీసుకొని అతను ముద్దుపెట్టుకోబోతుంటే అప్పుడే గీతాంజలి కొడుకు వచ్చి.. బావ అని పిలుస్తాడు. వీడుకొడు కరెక్ట్ టైమ్ కి వస్తాడని అనుకుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఏంటి బావ అలా మాట్లాడుతున్నావని గీతాంజలి కొడుకు వాళ్ళ బావని అడుగగా.. మాస్ అమ్మాయిలతో మాస్ గా డీల్ చేయాలి.. క్లాస్ అమ్మాయిలతో క్లాస్ గా డీల్ చేయాలని అతను చెప్తాడు. తర్వాత గీతాంజలి వాళ్ళ అన్నయ్య, నాన్న, భర్తతో కలిసి హ్యాపీగా ఉంటుంది. ఇక గీతాంజలి వాళ్ళ భర్త గీతాంజలిని పొగుడుతుంటాడు.
చందమామలో అయినా మచ్చ ఉంటుందేమోగానీ నా గీతాంజలిలో చిన్న గీత కూడా ఉండదని గీతాంజలి భర్త పొగుడుతుంటే తనేమో తన గతాన్ని తల్చుకొని బాధపడుతుంది. అదేసమయంలో శబరి అనాధాశ్రమంలోని అంజలి బాధపడుతుంది. ఆశ్రమంలోని అందరు బాధపడుతున్నారని ఒక పాప చెప్పేసరికి తను అందరిని నవ్వించడానికి ఒక చిన్న నాటకం వేస్తుంది. ఇక అక్కడి పిల్లలంతా చాలా కోరికలు కోరడంతో అంజలి తట్టుకోలేక ఇక చాలు అని అంటుంది. ఇక ఆశ్రమానికి ఒక పాప పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలని వస్తుంది. ఇక ఆ పాప అందరికి బట్టలు పంచిపెడుతుంది. అదే సమయంలో ఆ పాప కంట్లో ఏదో పడితే వాళ్ళ అమ్మ చూస్తుంది. అది చూసిన అక్కడి పిల్లలంతా బాధగా చూస్తారు. ఇక అదే సమయంలో అంజలి కూడా ఎమోషనల్ అవుతుంది.
![]() |
![]() |